: మధ్యంతర భృతిపై మంత్రి ఆనం, సీఎస్ మహంతి చర్చలు
నలభై ఐదు శాతం మధ్యంతర భృతి ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి కిందట సచివాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు.