: సీఎం తీరుపై సోనియా జోక్యం చేసుకోవాలి: గండ్ర


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం విషయంలో సోనియాగాంధీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్ లో మీడియాతో మాట్లాడిన గండ్ర.. సీఎం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. నోట్లో స్వీటు పెట్టి.. కంట్లోకారం చల్లినట్లు వ్యహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. శ్రీధర్ బాబుకు శాసనసభ వ్యవహారాల శాఖ తప్ప మరే శాఖ ఇచ్చినా ఒప్పుకోమని స్పష్టం చేశారు. శాఖలు మార్చి తెలంగాణను అడ్డుకోవాలని సీఎం చూస్తున్నారన్నారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగదన్నారు. అయితే, రాష్ట్రపతి సూచించిన విధంగా ఈ నెల 23న టీబిల్లు పార్లమెంట్ కు వెళుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News