: గూగుల్, ఎలక్షన్ కమిషన్ టై అప్


ఓటరు నమోదు కోసం ఎలక్షన్ కమిషన్ గూగుల్ సాయం తీసుకుంటోంది. ఈ మేరకు రెండూ చేతులు కలిపాయి. నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున పెద్ద ఎత్తున ఆన్ లైన్ ఓటరు నమోదు కార్యక్రమానికి వీలుగా ఈసీ గూగుల్ సెర్చింజన్, మ్యాప్ తదితర సేవలను వినియోగించుకోనుంది. ఓటరు తన పేరు జాబితాలో ఉందో లేదో చూసుకోవడంతో పాటు, పోలింగ్ స్టేషన్లు ఎక్కడున్నాయో గూగుల్ మ్యాపుల ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ కు 30లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నా.. రూపాయి తీసుకోకుండా ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చింది.

  • Loading...

More Telugu News