: నేటి నుంచి ఢిల్లీ అసెంబ్లీ.. కేజ్రీ విశ్వాస పరీక్ష నెగ్గుతారా?
ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వారం రోజుల పాటు కొనసాగుతాయి. ఈ సమావేశాల సందర్భంగా కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సమావేశాల్లో కేజ్రీవాల్ ప్రభుత్వం బలనిరూపణ (విశ్వాసం) చేసుకోవాల్సి ఉంటుంది. 70 మంది సభ్యులు గల ఢిల్లీ శాసనసభలో ఏఏపీకి 28 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఏఏపీకి వెలుపలి నుంచి మద్దతు ఇస్తోంది. ఈ క్రమంలో సభలో తమకున్న బలాన్ని ఏఏపీ ప్రభుత్వం నిరూపించుకోవాల్సి ఉంటుంది. సభ మూడో రోజున స్పీకర్ నియామకం జరిగే అవకాశాలున్నాయి.
రానున్న 48 గంటలు ఏఏపీకి అత్యంత కీలకమని ఏఏపీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. విశ్వాస పరీక్షను ఏఏపీ నెగ్గుతుందో లేదో అనే విషయం రెండు రోజుల్లో తేలిపోతుందని చెప్పారు.