: నాకు ఆ శాఖ వద్దు: మంత్రి శ్రీధర్ బాబు కినుక
తన శాఖ మార్పుపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సీఎం కేటాయించిన వాణిజ్య పన్నుల శాఖ తనకు వద్దని వెల్లడించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, వాణిజ్యపన్నుల శాఖ బాధ్యతలు స్వీకరించనని స్పష్టం చేశారు. శాఖ మార్పుపై మీ స్పందన ఏంటి? అని పాత్రికేయులు అడగగా పార్టీ పెద్దలతో మాట్లాడాకే తాను స్పందిస్తానని చెప్పారు.