: ఇలాంటివి కూడా విడాకులకు కారణమవుతాయా?


కావేవీ విడాకులు తీసుకోవడానికి అనర్హం అన్నట్టుగా ఉంది... కొందరు కొన్ని చిన్న విషయాలకే విడాకులు కావాలంటూ కోర్టుకెక్కేస్తారు. ఇలాంటి వాటిలో మరీ సిల్లీగా అనిపించేవిగా వీటిని చెప్పుకోవచ్చు. గతంలో వాడే బ్రెడ్‌ఫోర్క్‌ను, ఒక భర్తగారు పచ్చిబఠాణీలను తినడానికి వాడాడట. పచ్చి బఠాణీలను తినడానికి మామూలు ఫోర్క్‌కు బదులుగా బ్రెడ్‌ ఫోర్క్‌ వాడాడంటూ భార్యగారు విడాకులు కావాలంటూ కోర్టుకెక్కారట. కువైట్‌లోని ఈ భార్యాభర్తల 'విడాకుల వివాదం'లో తన భర్తకు టేబుల్‌ మ్యానర్స్‌ లేదని, ఇలాంటి భర్తతో జీవితాంతం కలిసి ఉండటం అసాధ్యమంటూ సదరు భార్యగారు వాపోయారట.

ఈ విషయం చదివితే మీకు ఆశ్చర్యం వేసింది కదూ... అయితే ఇంకో విషయం ఏమంటే... మన ఇంట్లో మామూలుగా అయితే టూత్‌పేస్టును ఒక్కొక్కరు ఒక్కోవిధంగా నొక్కి బ్రష్‌పై పేస్టు వేసుకుంటారు. కొందరైతే చివరి నుండి నొక్కి వేసుకుంటే బాగుంటుందని చెబుతుంటారు. అలాకాకుండా పేస్టు ట్యూబ్‌ మధ్యలో నొక్కి వేసుకోవడమే సదరు భర్తగారు చేసిన తప్పు. దీనికే తమకు విడాకులు కావాలంటూ భార్యగారు కోర్టుకెక్కారు. దీనిపై వాదిస్తూ.... ఈ విషయం గురించి తాము ఎన్నోసార్లు వాదించుకున్నామని, ట్యూబు చివరనుండి నొక్కాలని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని భర్తపై అంతెత్తున అరచిందట భార్య. మరో విడాకుల కేసులో నమ్మశక్యం కాని కారణం... కేవలం తాను మంచినీళ్లు అడిగినప్పుడు వెంటనే నీళ్లు తేలేదని కారణంగా చూపించి భర్త భార్యనుండి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడట. మొత్తానికి కువైట్‌లో ఇలాంటి విచిత్రమైన విడాకుల కేసులు కోర్టుకు వస్తున్నాయట. అందుకే ఇకపై కాదేదీ విడాకులు కోరడానికి అనర్హం అని చెప్పుకోవాల్సి ఉంటుందేమో!

  • Loading...

More Telugu News