: రాజకీయం చేయకుండా అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతివ్వాల్సిందే: ఈటెల
శాసనసభలో అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతు ఇవ్వకపోవడంపై టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ మండిపడ్డారు. రాజకీయం చేయకుండా తెలుగుదేశం కూడా అవిశ్వాస తీర్మానానికి కలిసి రావాలన్నారు. సభ వాయిదా అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఈటెల... అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీలు ఒకేతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంచితే, సర్కారుకు ధరల నియంత్రణపై అదుపులేకపోవటం దారుణమని విమర్శించారు. విద్యుత్ కోతలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడంలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదని ఘాటు వ్యాఖ్య చేశారు.
ఇదిలా ఉంచితే, సర్కారుకు ధరల నియంత్రణపై అదుపులేకపోవటం దారుణమని విమర్శించారు. విద్యుత్ కోతలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడంలేదన్నా