: తెలంగాణపై నాన్చితే కాంగ్రెసుకే నష్టం : పొంగులేటి
తెలంగాణ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే, సమస్యను నాన్చడంవల్ల కాంగ్రెస్ పార్టీకే తీవ్ర నష్టమని హెచ్చరించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన పొంగులేటి, టీ జేఏసీ, రాజకీయ పార్టీలు సొంత ఎజెండాలు పక్కన బెట్టాలని హితవు పలికారు.