: సోనియాను వెనక్కి నెట్టిన మోడీ


గూగుల్ సెర్చ్ లో అత్యధికులు తెలుసుకోవాలనుకున్న భారతీయ రాజకీయనాయకుడి రేసులో నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలిచారు. భారత రాజకీయాల్లో సంచలనరీతిలో దూసుకొస్తున్న నరేంద్రమోడీ గురించి ఎక్కువమంది నెటిజన్లు సెర్చ్ చేసినట్టు గూగుల్ కి చెందిన జట్జియస్ట్ సంస్థ తెలిపింది. ఆయన తరువాతి స్థానంలో యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిలిచారు.

దీంతో గూగుల్ సెర్చ్ లో మోడీ సోనియాను వెనక్కినెట్టారు. తరువాత రాహుల్ గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి ఎక్కువ మంది నెటిజన్లు వెతికారు. వీరి తరువాతి స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిలవగా, ఆమె తరువాత మరో రాజకీయ సంచలనం అరవింద్ కేజ్రీవాల్ నిలవడం విశేషం.

  • Loading...

More Telugu News