: ఒబామా, హిల్లరీలకే అమెరికన్ల 'ప్రశంస'లు
అమెరికాలో వరుసగా ఆరో ఏడాదీ అధ్యక్షుడు ఒబామా, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కే అమెరికన్లు తమ ఓటేశారు. అత్యంత ప్రశంసనీయ మ్యాన్, ఉమ్యాన్ గా ఒబామాకు 16 శాతం, హిల్లరీకి 15 శాతం మంది మద్దతు పలికారు. గల్లప్ తాజా సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్, పోప్ ఫ్రాన్సిస్ లకు వీరిద్దరూ అందనంత ఎత్తులో ఉన్నారు. బుష్, ఫ్రాన్సిస్ లకు చెరో 4శాతం ఓట్లు వచ్చాయి. క్లింటన్ భార్య హిల్లరీ, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు 2 శాతం ఓట్లే వచ్చాయి. తదుపరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలున్న విషయం తెలిసిందే.