: ప్రధానికి జయలలిత ఘాటు లేఖ
శ్రీలంక సైన్యం తమిళ మత్స్యకారులపై చేస్తున్న దాడులు, అక్రమ అరెస్టులను ఖండిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో ప్రధానిని కోరారు. దాడులకు పాల్పడిన లంక సైన్యంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని జయలలిత లేఖలో విమర్శించారు.