: బంగ్లాదేశ్ లో హింస ఆమోదనీయం కాదు: అమెరికా
ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్ లో హింస తలెత్తడం ఎంతమాత్రమూ ఆమోదనీయం కాదని అమెరికా పేర్కొంది. అక్కడి రాజకీయ పార్టీలన్నీ నిర్మాణాత్మక చర్చల ద్వారా పారదర్శక, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు తోడ్పడాలని సూచించింది. బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని అమెరికా విదేశాంగ ఉప అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ ప్రకటన జారీ చేశారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడుతుండడంతో బంగ్లాదేశ్ ఉడికిపోతోంది.