: హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి రేపు తెల్లవారు జాము 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పై వాహనాల రాకపోకలు నిషేధించామన్నారు. రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు హైదరాబాద్ లోని అన్ని ఫ్లైఓవర్లను మూసి వేస్తున్నట్టు చెప్పారు. భారీ వాహనాలు ఈ రోజు నగరంలో ప్రవేశించడాన్ని నిషేధించినట్టు ఆయన వివరించారు.