: ఏం తమ్ముళ్లూ బాగున్నారా?: చంద్రబాబు ఆత్మీయ పలకరింత
"ఏం తమ్ముళ్లూ బాగున్నారా?' అంటూ పలకరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒంగోలు ప్రజాగర్జన సభలో కార్యకర్తలను ఉత్సాహపరిచారు. 'మీ ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా ఉంద'ని చంద్రబాబు నాయుడు అన్నారు. 'తొందర్లోనే మీ రుణం తీర్చుకుంటా'నని హామీ ఇచ్చారు. 'వేదిక కిందనున్న తమ్ముళ్లు ఉత్సాహంగా ఉన్నారు కానీ, వేదికపైనున్న వారు హుషారుగా లేరని' అంటూ వారినీ ఉత్సాహపరిచారు. ప్రజలు ఉత్సాహంగా ఉంటే దూకుడు ఆపగలిగే వారు లేరని అన్నారు.