: కుప్పకూలిన భారత్.. సఫారీల విజయలక్ష్యం 58 పరుగులే


దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓటమి అంచున నిలుచుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కేవలం 223 పరుగులకే అలౌట్ అయింది. దీంతో సఫారీలకు కేవలం 58 పరుగుల విజయలక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది. మరో 50 ఓవర్ల ఆట మిగిలి ఉండడంతో టీమిండియా ఓటమి ఖాయంగా మారింది. తొలి టెస్టులో అద్భుతంగా రాణించి ప్రమాద హెచ్చరికలు పంపిన భారత జట్టు రెండో టెస్టులో విఫలమైంది.

తొలి ఇన్నింగ్స్ లో 334 పరుగులు సాధించిన టీమిండియా సౌతాఫ్రికాను కట్టడి చేయడంలో విఫలమైంది. దీంతో సఫారీలు తొలి ఇన్నింగ్స్ లో 500 పరుగులు సాధించారు. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కేవలం 223 పరుగులకే ఆలౌట్ అయింది. సౌతాఫ్రికాకు భారత జట్టు కేవలం 58 పరుగుల విజయలక్ష్యం నిర్దేశించింది. భారత జట్టులో అజింక్య రహానే(96) రాణించగా సౌతాఫ్రికా జట్టులో పీటర్సన్(4), స్టెయిన్(3) ఫిలాండర్(3)లు రాణించారు.

  • Loading...

More Telugu News