: కేజ్రీవాల్ ను కలవాలనుకుంటున్న కింగ్ ఫిషర్ ఉద్యోగులు


పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ... గత 17 నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదు. దీంతో తమ గోడును వెళ్లబోసుకునేందుకు కింగ్ ఫిషర్ ఉద్యోగులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలవాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీలో ఉన్న కింగ్ ఫిషర్ ఉద్యోగులు కేజ్రీవాల్ అపాయింట్మెంటును కోరాలని నిర్ణయించారు. ఢిల్లీలో దాదాపు 500 మంది కింగ్ ఫిషర్ ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటికే తమ సమస్యను పరిష్కరించేలా చర్చలు తీసుకోవాలంటూ కాంగ్రెస్, బీజేపీలను కలిశామని... కానీ ఎవరూ స్పందించలేదని వారు వాపోయారు.

  • Loading...

More Telugu News