: సివిల్స్ నోటిఫికేషన్ పై హైకోర్టులో సుజనా చౌదరి పిటిషన్


యూపీఎస్సీ తాజా సివిల్స్ నోటిఫికేషన్ లో ప్రాంతీయ భాషలకు విఘాతం కలిగించేలా నిబంధనలు ఉన్నాయంటూ, తెలుగుదేశం ఎంపీ సుజనా చౌదరి హైకోర్టులో నేడు పిటిషన్ దాఖలు చేశారు. ప్రాంతీయ భాషల్లో విద్యాభ్యాసం చేసిన అభ్యర్థులు ఇలాంటి నిబంధనల కారణంగా నష్టపోతారని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు.

కాగా, ఇంతకుముందు సివిల్స్ పరీక్షలను తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులు ఈరోజు ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. యూపీఎస్సీ నిబంధనలతో తమకు అన్యాయం జరిగిందని వారు నిరాహార దీక్షకు ఉపక్రమించారు. 

  • Loading...

More Telugu News