: సమగ్ర సమాచారం లేనప్పుడు చర్చ ఎలా చేపడతారు?: లోక్ సత్తా
టీబిల్లులో సమగ్ర సమాచారం లేనప్పుడు... దానిపై చర్చ ఎలా చేపడతారని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు అన్నారు. ఆర్టికల్-3 ప్రకారం ఇంత వరకు ఏ రాష్ట్ర ఏర్పాటు జరగలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఆ పార్టీకి నూకలు చెల్లడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లు ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగించేలా ఉందని విమర్శించారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.