: పిల్లిని జార్ లో పెట్టిన విద్యార్థినిపై కేసు
పిల్లిపై కోపాన్ని చూపించి తాను సమస్యను కొనితెచ్చుకుంది తైవాన్ యువతి. థాయ్ చుంగ్ ప్రావిడెన్స్ యూనివర్సిటీ విద్యార్థిని కికిలిన్ తన పెంపుడు పిల్లిని ప్లాస్టిక్ జార్ లో పెట్టి మూతేసి, ఆ ఫొటోను తీసుకెళ్లి ఫేస్ బుక్ లో పెట్టేసింది. జంతువు పట్ల ఇదేం ప్రవర్తన? అంటూ ఫేస్ బుక్ యూజర్లు తిట్టిపోశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. జంతువులను హింసించినందుకు కికిలిన్ పై కేసు పెట్టారు. నేరం నిరూపణ అయితే, భారీగా జరిమానా, ఏడాది వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.