: ఎవరెస్ట్ ఎక్కిన వీరుడు.. కూరగాయలమ్ముకుంటున్నాడు


24 ఏళ్ల రామ్ లీల్ సాహస ప్రియుడు. చండీగఢ్ కు చెందిన ఇతడు ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. అయితేనేమి... చిన్న ఉద్యోగం కూడా దొరకలేదు. హర్యానా ప్రభుత్వం నుంచి కనీస ఆదరణ లేదు. 5 లక్షల రూపాయల రివార్డు అయితే ప్రకటించింది గానీ ఇంతవరకు ఇవ్వలేదు. దాంతో తన కుటుంబాన్ని బతికించుకోవడానికి వీధి వ్యాపారిగా మారిపోయాడు. తోపుడు బండిపై కూరగాయలు అమ్మకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన తండ్రి వైద్య ఖర్చుల కోసం చేసిన అప్పు తీర్చేందుకు ఇది మినహా అతడికి మరో మార్గం తోచలేదు.

  • Loading...

More Telugu News