: ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ మరో సారి దాడులు


ఏకే ఖాన్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత... తనదైన శైలిలో కొరడా ఝుళిపిస్తున్నారు. వారం క్రితం ఆరు చోట్ల చెక్ పోస్టులపై ఆకస్మిక దాడులు నిర్వహించి ముచ్చెమటలు పట్టించిన ఏసీబీ... ఈ తెల్లవారుజామున మరోసారి ఆరు చెక్ పోస్టులపై విరుచుకుపడింది. శ్రీకాకుళం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, నిజామాబాద్, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.

ఈ క్రమంలో నెల్లూరు జిల్లా తడ మండలం బీవీ పాలెం చెక్ పోస్టులో రూ. 56 వేల లెక్క తెలియని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ చెక్ పోస్టులో రూ. 36 వేలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పురుషోత్తమపురం చెక్ పోస్టులో ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ. 1.20 లక్షల అవినీతి సొమ్మును గుర్తించారు. ఈ సందర్భంగా అవినీతికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News