: ఈ 'హ్యాండ్'బ్యాగు భలే
హ్యాండ్ బ్యాగు అంటే అందులో ఆడవారికి అవసరమైన పలు రకాల వస్తువులను ఉంచుకునేదిగా మనందరికీ తెలుసు. వారికి అత్యవసరమైన పౌడరు, ఇరత క్రీముల నుండి పెప్పర్ స్ప్రే వరకూ చాలా వస్తువులను అందులో ఉంచుకుని వెళుతుంటారు. అదే బ్యాగు వారికి ఆపదల నుండి రక్షించేదిగా కూడా ఉపయోగపడేలా ఉంటే... అలాంటి ఒక సరికొత్త బ్యాగు మార్కెట్లోకి వచ్చింది.
ఈ హ్యాండ్ బ్యాగ్‌ను పీస్ కీపర్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ బ్యాగ్‌పైన హ్యాండిల్‌లాగా ఉండే ఆకారానికి ముళ్లులాంటి నునుపుదేలిన భాగాలు ఉంటాయి. బయట తిరిగే మగువలు తమకు ఏదయినా హాని కలుగుతుంది అనిపించిన మరుక్షణం బ్యాగు నుండి హ్యాండిల్ భాగాన్ని వేరుచేసి దాన్ని వేళ్లకు తగిలించుకుని తమపై దాడికి పాల్పడేవారికి ఒక్కటిచ్చుకుంటే సరి... అవతలివారు పరారే. రాజమౌళి సినిమాలో హీరో ఆయుధంలాగా వెరైటీగా కనిపించే ఈ 'హ్యాండిల్' బ్యాగు మగువలకు చక్కటి రక్షణగా కూడా పనికొస్తుంది మరి!