: వైభవంగా నాని నటించిన ‘జెండాపై కపిరాజు’ ఆడియో వేడుక
‘అలా మొదలైంది‘ అంటూ.. కెరీర్ ప్రారంభించిన యువ కథానాయుకుడు నాని నటించిన ‘జెండాపై కపిరాజు‘ ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు హైదరాబాదులో వైభవంగా జరిగింది. నాని హీరోగా, అమలాపాల్ హీరోయిన్ గా తమిళ దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘జెండాపై కపిరాజు’. గతంలో వాస్తవానికి దగ్గరగా ఉన్న చిత్రాలను రూపొందించి తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన సముద్రఖని కేఎస్ శ్రీనివాస్, కేఎస్ శివరామన్, మల్టీ డైమెన్సన్ లు వాసన్ విజువల్ వెంచర్స్ పతాకంపై భారీ అంచనాల మధ్య ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు సంగీతాన్ని జీవీ ప్రకాష్ కుమార్ అందించారు. కాగా ‘జెండాపై కపిరాజు’ జనవరిలో విడుదల కానుంది.