: విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె.. ఐదు జిల్లాల్లో అంధకారం
విద్యుత్ ఉద్యోగులు తాజాగా సమ్మె సైరన్ మోగించారు. విద్యుత్ పంపిణీ సంస్థలోని ఓ విభాగంలో పనిచేసే ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసు జారీ చేశారు. సమ్మె ప్రభావంతో ఈ రోజు ఐదు జిల్లాల్లో విద్యుత్ సరసరా నిలిచిపోనుంది. అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో.. ఇవాళ రాత్రి నుంచి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అంధకారం నెలకొంటోంది.