: కేసీఆర్ ను కాదు బాబును నిలదీయండి: హరీష్ రావు
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వారిపై టీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ టీడీపీ నేతలు కేసీఆర్ ను విమర్శించడం మాని సమన్యాయం పేరుతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న చంద్రబాబును నిలదీయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ను విలీనం చేస్తే తెలంగాణ ఇస్తానని సోనియాగాంధీ టీడీపీ నేతలకు చెప్పారా? అని ఆయన ప్రశ్నించారు.