: లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 25 మందికి గాయాలు
నెల్లూరు జిల్లాలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది క్షతగాత్రులయ్యారు. మర్రిపాడు మండలం పొంగూరు కండ్రిగ సమీపంలో ఆర్టీసీ బస్సు లారీని ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 25 మందికి గాయాలయ్యాయి, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.