: మన దగ్గర మంత్రదండం లేదు.. అయినా సాధిద్దాం: కేజ్రీవాల్
ఢిల్లీలో సాధించిన విజయం కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నేతల వల్లే సాధ్యం కాలేదని... ఢిల్లీలోని కోటిన్నర ప్రజల వల్ల సాధ్యమైందని అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఇంతటితో పోరాటం ముగిసిపోలేదని, ఇది కేవలం ఆరంభం మాత్రమే అని కేజ్రీవాల్ తెలిపారు. అసలు పోరాటం ఈ క్షణం నుంచే ప్రారంభం కానుందని ఆయన అన్నారు. ఢిల్లీలో ఉన్న కోటిన్నర మంది పోరాటం, ఉక్కు సంకల్పాన్ని నెరవేర్చేందుకు ప్రతి క్షణం కష్టపడతామని భరోసా ఇచ్చారు.
దేశంలో నెలకొన్న దుష్ట సంప్రదాయాన్ని, ఢిల్లీలో నెలకొన్న సంక్షోభాల్ని అందరం కలిసి తరిమికొడదాం అని పిలుపునిచ్చారు. తమ వద్ద అన్ని సమస్యల పరిష్కారానికి మంత్రదండం లేదని... మనమందరం కలసి సమస్యలన్నింటికీ పరిష్కారమార్గాలు వెతుకుదామని కేజ్రీవాల్ తెలిపారు.