: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్
ఢిల్లీ ఏడవ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కేజ్రీవాల్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఈశ్వరుడిపై ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఏపీ అభిమానులతో రాంలీలా మైదానం కిక్కిరిసి పోయింది. కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే మైదానం మొత్తం కార్యకర్తల కేరింతలతో మారుమోగింది.