: గాంధీ భవన్ లో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని హైదరాబాద్ గాంధీభవన్ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను చెప్పుకునే స్వేచ్ఛ కేవలం కాంగ్రెస్ పార్టీలోనే ఉందని ఈ సందర్భంగా బొత్స చెప్పారు. సమష్టి నిర్ణయానికి కట్టుబడి ఉండటం కాంగ్రెస్ విధానమని అన్నారు. కష్టపడి పనిచేసే వారందరికీ కాంగ్రెస్ పార్టీలో ఆదరణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్, జానారెడ్డి, కాసు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.