: రైలు ప్రమాదంలో 26కు చేరిన మృతుల సంఖ్య
అనంతపురం జిల్లాలోని కొత్త చెరువు సమీపంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాద ఘటనలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 23 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. ఘటనా స్థలిలో రైల్వే అధికారులు సహాయక కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు.. మృతదేహాలను బెంగళూరు తరలిస్తున్నారు.