: అఖిలపక్షంతో నేడు ఏపీఎన్జీవోల భేటీ
ఎపీఎన్జీవోలు నేడు అఖిలపక్షంతో మరోసారి భేటీ కానున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఏపీఎన్జీవో హోమ్ లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో జనవరి 3 నుంచి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. జనవరి 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు పున:ప్రారంభం అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఏపీఎన్జీవోలు అఖిలపక్షంతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమావేశానికి వైఎస్సార్సీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు హాజరయ్యాయి.