: రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మన్మోహన్ తీవ్ర దిగ్భ్రాంతి
అనంతపురం జిల్లా కొత్త చెరువు రైల్వే స్టేషన్ వద్ద నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు ఏసీ బీ-1 బోగీలోమంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు సహా 23 మంది సజీవ దహనమయిన రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గేతో ఫోన్ లో మాట్లాడిన ఆయన ప్రమాద ఘటనపై విచారణ జరిపించాలని ఆదేశించారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు.