: బరువు తగ్గాలనుకునేవారికి ఒక శుభవార్త


చాలామంది విపరీతమైన బరువుతో సతమతమవుతుంటారు. ఇలాంటివారు బరువు తగ్గడానికి రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారికి మాత్రం ఇది నిజంగా ఒక శుభవార్తే. ఏమంటే బరువు తగ్గించడంలో ఎంతగానో తోడ్పడే ఒక సరికొత్త యాంటీ ఆక్సిడెంట్‌ను పరిశోధకులు కనుగొన్నారు. ఈ యాంటీ ఆక్సిడెంట్‌ చక్కగా బరువును తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రొఫెసర్‌ థామస్‌ రేనాల్డ్స్‌, జోనాతాన్‌ పార్కెర్‌ అనే శాస్త్రవేత్తలు బరువు తగ్గించడంలో ఉపకరించే అంశాలపై చేసిన పరిశోధనల్లో ఒక రకమైన మిశ్రమం బరువును తగ్గించడంలో చక్కగా తోడ్పడినట్టు గుర్తించారు. మాంగనీస్‌ టెట్రాకిస్‌ (4`బెంజోయిక్‌ యాసిడ్‌), పోర్ఫిరిన్‌ (ఎంఎన్‌టీబీఏపీ) మిశ్రమం బరువును తగ్గించడంలో బాగా తోడ్పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ మిశ్రమాన్ని అధిక బరువున్న ఎలుకల్లో ప్రయోగించగా అవి 40 శాతం వరకూ బరువు తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ మిశ్రమంపై ఇప్పటికే పేటెంట్‌ వచ్చేసింది.

ఈ మిశ్రమం శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వులోని ట్రైగ్లీసిరైడ్స్‌ను విచ్ఛిన్నం చేయడం ద్వారా ఇది బరువు తగ్గడానికి కారణమవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. తాము కనుగొన్న మిశ్రమం స్థూలకాయ చికిత్సలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుందని తాము భావిస్తున్నామని, ఈ మిశ్రమం ద్వారా అధిక బరువున్న వారు చక్కగా బరువు తగ్గవచ్చని, బరువు కారణంగా వచ్చే టైప్‌`2 మధుమేహం వంటి సమస్యలను కూడా నివారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News