: కిరణ్ గైర్హాజరీపై రాహుల్ స్పందన
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశానంతరం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ తప్ప మిగిలిన సీఎంలంతా హాజరయ్యారు. దీంతో, అక్కడున్న మీడియాకు ఎక్కడ లేని అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆ అనుమానాలకు రాహుల్ తెరదించారు. కుటుంబంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు కిరణ్ హైదరాబాద్ వెళ్లిపోయారని తెలిపారు.