: గ్రామాల తీర్మానాలను రాష్ట్రపతికి, శాసనసభ స్పీకర్ కు పంపిస్తాం: అశోక్ బాబు
రాష్ట్ర విభజన అంశంపై అన్ని గ్రామాల నుంచి తీర్మానం తీసుకుని రాష్ట్రపతి, శాసనసభ స్పీకర్ లకు పంపిస్తామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై శనివారం నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సమ్మె అనివార్యతపై ఉద్యోగులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. విభజన ఎందుకు చేయకూడదన్న అంశంపై ఎమ్మెల్యేలకు పార్టీలు అవగాహన సదస్సు నిర్వహించాలని ఆయన సూచించారు. రేపు ముఖ్యమంత్రిని కలసి ఐఆర్ పై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరతామన్నారు. ఆరోగ్యకార్డులపై పింఛనుదారులు కూడా అసంతృప్తితో ఉన్నారని ఆయన తెలిపారు.