: ఎంబీఎస్ జ్యుయలర్స్ అధినేతకు జనవరి 9 వరకు రిమాండ్


బంగారం దిగుమతి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ మినరల్స్ అండ్ మెటల్స్ కార్పొరేషన్ ను మోసం చేసిన కేసులో ఎంబీఎస్ జ్యుయలర్స్ సంస్థ యజమాని సుఖేష్ గుప్తాకు సీబీఐ న్యాయస్థానం జనవరి 9 వరకు రిమాండ్ విధించింది. 2012లో జరిగిన మినరల్స్ అండ్ మెటల్స్ కార్పొరేషన్ ను మోసం చేసిన కేసుపై... ఈ ఉదయం నుంచి కోఠిలోని సీబీఐ కార్యాలయంలో ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ ముసద్దీలాల్ భగవత్ స్వరూప్ జ్యుయలర్స్ అధినేత సుఖేష్ గుప్తాను విచారించిన అనంతరం అరెస్టు చేశారు. ఎంఎంటీసీ సీనియర్ మేనేజర్ రవిప్రకాశ్ ను కూడా పోలీసులు అరెస్టు చేయగా, న్యాయస్థానం జనవరి 9 వరకు రిమాండ్ విధించింది.

  • Loading...

More Telugu News