: రాహుల్ నేతృత్వంలో ముగిసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశం
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఈ సాయంత్రం 5.15 నిమిషాలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా హాజరైన సంగతి తెలిసిందే.