: జగన్ పై చర్యలు తీసుకోవాలి: మంత్రి బాలరాజు


రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని అవమానపరిచేలా మాట్లాడటం మంచిది కాదని మంత్రి బాలరాజు అన్నారు. స్పీకర్ కు బుద్ధి ఉందా? అని ప్రశ్నించిన జగన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన వైజాగ్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని వీడాలనుకుంటున్న సన్నిహితులను పిలిచి మాట్లాడతామని చెప్పారు. పార్టీలను మారాలనుకోవడం ఆర్థిక నేరాలకన్నా ప్రమాదకరమని తెలిపారు.

  • Loading...

More Telugu News