: సీఎం పదవి, వెయ్యి కోట్ల కోసం కేసీఆర్ బేరాలాడుతున్నాడు: మోత్కుపల్లి


తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. తన పార్టీని కేసీఆర్ విలీనం చేయనందుకే తెలంగాణను సోనియా జాప్యం చేస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో నోట్లు, ఓట్లు, సీట్లు దండుకోవడం కోసమే కేసీఆర్ తన పార్టీని విలీనం చేయడంలేదని విమర్శించారు. ఈ రోజు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణపై సోనియా నిర్ణయం తీసుకున్న తర్వాత కేసీఆర్ ఏమి చేస్తున్నారో చెప్పాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం, వెయ్యి కోట్ల కోసం కాంగ్రెస్ తో కేసీఆర్ బేరాలాడుతున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాప్యానికి కారణమేంటో చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందని తెలిపారు. జాప్యం కారణాన్ని ఇతర పార్టీలపై నెట్టేసి కేసీఆర్ తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News