: కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం గురించి వారికెందుకు?: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను విలీనం చేస్తే... తెలంగాణ తొందరగా ఏర్పాటవుతుందంటూ టీ.టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తుండటంపై టీఆర్ఎస్ నేత కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం గురించి టీడీపీకి ఏం అవసరమని ఆయన సూటిగా ప్రశ్నించారు. టీడీపీ దళారుల పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరుగుతోందంటూ చంద్రబాబు అంటున్నారని... ఏ రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారో ఆయన క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.