: 35 మంది అమెరికా నౌకా సిబ్బందికి షరతులతో బెయిలు
అక్రమంగా ఆయుధాలను రవాణా చేస్తూ భారత తీర జలాల్లోకి ప్రవేశించి పట్టుబడ్డ అమెరికా నౌకా సిబ్బంది 35 మందికి తమిళనాడులోని ట్యూటికోరిన్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారిని అరెస్ట్ చేసి 60 రోజులు దాటినా చార్జ్ షీటు దాఖలు చేయడంలో పోలీసులు విఫలమైనందున నౌకా సిబ్బందికి కోర్టు బెయిల్ ఇచ్చింది. కేసును దర్యాప్తు చేస్తున్న క్యూ బ్రాంచ్ పోలీసుల ఎదుట ప్రతిరోజూ హాజరు కావాలని ఆదేశించింది.