: శాసనసభలో బిల్లుపై చర్చకు అభ్యంతరం లేదు: యనమల
విభజన బిల్లుపై శాసనసభలో చర్చకు తమకు అభ్యంతరం లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆర్టికల్ 189 ప్రకారం బిల్లులోని ప్రతి అంశంపైన ఓటింగ్ జరగాలని కోరారు. అయితే, మొదట అసెంబ్లీకి తీర్మానం పంపుతామన్న దిగ్విజయ్ ఆ తర్వాత మాట మార్చారని విమర్శించారు. అసెంబ్లీ నుంచి వెళ్లిన బిల్లుపై రాష్ట్రపతి న్యాయ సమీక్ష కోరాలని డిమాండ్ చేశారు.