: 102 ఏళ్ల జన గణ మన అధినాయక జయహే..
భారత జాతీయ గీతం జనగణమన 102 ఏళ్ల పండుగను జరుపుకుంటోంది. ఈ గేయాన్ని తొలిసారిగా 1911 డిసెంబర్ 27న భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సభలో ఆలపించారు. బెంగాలీ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఈ కమ్మని దేశభక్తి గీతం తర్వాత 1950 జనవరి 24న జాతీయ గీతమైంది. జాతి జనుల్లో దేశభక్తిని సజీవంగా ఉంచేందుకు, ఒక్కతాటిపై ఉండి ముందుకు కదిలించేందుకు యథాశక్తి తోడ్పడుతోంది. రవీంద్రనాథ్ ఈ గేయాన్ని బెంగాలీలో రాయగా.. అబిద్అలీ దాన్ని హిందీలోకి అనువదించారు.