: పుజారా అర్ధ శతకం... భారత్ 159/1
డర్బన్ లో సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ సఫారీ బౌలర్లపై పైచేయి సాధించింది. ఓపెనర్ ధావన్ 29 పరుగులకే వెనుదిరిగినప్పటికీ మురళీ విజయ్, పుజారా ఇన్నింగ్స్ ను నిర్మించారు. ఈ క్రమంలో మురళీ విజయ్ 74 పరుగులు (14 ఫోర్లు) చేయగా వన్ డౌన్ బ్యాట్స్ మెన్ పుజారా హాఫ్ సెంచరీ (53 పరుగులు,7 ఫోర్లు) పూర్తిచేసుకున్నాడు. ఈ క్రమంలో భారత్ ఒక్క వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది. మురళీ, పుజారాలు రెండో వికెట్ భాగస్వామ్యానికి 118 పరుగులు నమోదు చేశారు.