: బాక్సర్ విజేందర్ రక్తనమూనాల కోసం పంజాబ్ పోలీసుల న్యాయపోరాటం
మాదక ద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాక్సర్ విజేందర్ సింగ్ రక్త నమూనాలు సేకరించేందుకు అనుమతి కోసం పంజాబ్ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. రెండు రోజుల కిందట ఈ వ్యవహారంలో విజేందర్ ను పంజాబ్ పోలీసులు ప్రశ్నించారు. అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు రక్త నమూనాలు ఇవ్వాలని ఈ సందర్భంగా అతనిని కోరారు. అయితే, ఇందుకు విజేందర్ తిరస్కరించాడు.
దీంతో కోర్టు ద్వారానే తేల్చుకోవాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న విజేందర్ స్నేహితుడు, జాతీయ స్థాయి బాక్సర్ రామ్ సింగ్ ప్రధాన అనుమానితుడిగా ఉండడంతో జాతీయ శిక్షణ శిబిరం నుంచి అతనిని బహిష్కరించారు.