: తనపై ఎవరి ఒత్తిడి లేదన్న ఆర్.కె. రాఘవన్
తమ సిట్ పనితీరును అహ్మదాబాదు న్యాయస్థానం అభినందించడం సంతోషాన్ని కలిగించిందని సిట్ అధిపతి ఆర్.కె. రాఘవన్ తెలిపారు. తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదన్న రాఘవన్.. కేంద్ర హోం శాఖ, గుజరాత్ ప్రభుత్వం నుంచి తమకు పూర్తి సహకారం లభించిందని ఆయన పేర్కొన్నారు.
2002 అల్లర్లకు సంబంధించిన కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం విదితమే. అయితే.. సిట్ క్లీన్ చిట్ ను సవాలు చేస్తూ జకియా జాఫ్రీ వేసిన పిటిషన్ ను అహ్మదాబాదు కోర్టు ఈరోజు తిరస్కరించింది. అంతేకాదు.. సిట్ నివేదికను అహ్మదాబాదు కోర్టు సమర్థించడంతో నరేంద్ర మోడీకి ఈ కేసులో ఊరట లభించింది.