: శిక్ష పూర్తయిన ఖైదీలను విడుదల చేయాలని భారత్-పాక్ ఒప్పందం


జైలు శిక్ష పూర్తిచేసుకున్న ఖైదీలను విడుదల చేసేందుకు భారత్, పాకిస్థాన్ ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద అక్రమ రవాణా, అక్రమ చొరబాటుకు యత్నించి అరెస్టైన వారిని విడుదల చేయాలని... పాక్ రేంజర్స్ డీజీ మేజర్ జనరల్ తహిర్ జావెద్, భారత్ బీఎస్ఎఫ్ చీఫ్ సుభాష్ జోషి సమావేశంలో నిర్ణయించారు. పద్నాలుగు సంవత్సరాల తర్వాత వాఘా బోర్డర్ వద్ద రెండు దేశాల డీజీఎమ్ఓలు నిన్న(బుధవారం)సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News