: ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్ డొనాల్డ్స్ ఆ సలహా ఎత్తేసింది
'ఫాస్ట్ ఫుడ్ లో అధిక కేలరీలు, ఫ్యాట్ ఉంటాయి. దాన్ని తీసుకోవడం వల్ల ఒబెసిటీ సమస్యకు దారితీయవచ్చు. కనుక ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండండి' అంటూ తన ఉద్యోగులకు సూచించిన ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ల సంస్థ మెక్ డొనాల్డ్స్ జరిగిన నష్టాన్ని గుర్తించింది. ఒక పక్క ఫాస్ట్ ఫుడ్ విక్రయిస్తూ వ్యాపారం చేసుకుంటున్న కంపెనీ తన ఉద్యోగులను దానికి దూరంగా ఉండమని సూచించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఉద్యోగుల వెబ్ సైట్ నుంచి ఆ సూచనను కంపెనీ తొలగించింది.