: 'మెక్ డొనాల్డ్స్' ఉద్యోగులు ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉంటారట!
ప్రపంచవ్యాప్తంగా బర్గర్ అమ్మకాలతో 'మెక్ డొనాల్డ్స్' పేరు ప్రఖ్యాతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, తమ ఉద్యోగులు మాత్రం ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉంటారని మెక్ డొనాల్డ్స్ తెలిపింది. ఈ విషయాన్ని తమ వెబ్ సైట్ లో ఉంచింది. ఫాస్ట్ ఫుడ్ లో సోడియం, కొవ్వు ఎక్కువగా ఉంటాయని... ఇది ఒబేసిటీకి దారి తీస్తుందని ప్రపంచ ఫాస్ట్ ఫుడ్ చైన్ హెచ్చరించింది. 'ఫాస్ట్ ఫుడ్ త్వరగా, రీజనబుల్ ధరలో దొరుకుతుంది. ఇతర ఆహార పదార్థాలు దొరకనప్పుడు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. బిజీ జీవితంలో సౌకర్యవంతంగా దొరికే ఒక తినుబండారం. ఇందులో ఎక్కువ కేలరీలు, కొవ్వు, చక్కెర, ఉప్పు ఉండి అధిక బరువుతో ప్రజలను ఇబ్బందిలో పడేస్తుంది' అని వెబ్ సైట్ లో తెలిపింది.