: చిన్నారిని సూదులతో గుచ్చి గుచ్చి చంపాలనుకున్న రాక్షస తండ్రి
బిడ్డలపై తల్లిదండ్రులకు చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. అంతేకాదు నెలల శిశువులను చూసిన వారెవరైనా ప్రేమతో దగ్గరకు తీసుకుంటారు. కానీ, చైనాలో ఓ రాక్షస తండ్రి అనుమానంతో 2 నెలల కూతురిని సూదులతో గుచ్చి గుచ్చి చంపడానికి ప్రయత్నించాడు. ఆ బిడ్డ తనకు పుట్టలేదన్న అనుమానంతోనే అతడీ దారుణ చర్యకు పాల్పడ్డాడు. దీంతో హిలాంగ్జియాంగ్ కోర్టు నిందితుడు ఇన్ జిహేకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.